Minor Gang Rape In Jaipur: రాజస్థాన్ జైపుర్‌లోని కనోటా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్‌కు లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్న యువకుడు మరికొందరితో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు పోలీసులు.
'''జనవరి 19న బాలిక సమీపంలోని రింగ్ రోడ్డు ప్రాంతానికి వెళ్లింది. ఆ క్రమంలో లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్న ఓ యువకుడు ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడికి మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ముగ్గురు కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని బెదిరించారు. ఆరు గంటలపాటు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడి యథావిధిగా రింగ్ రోడ్డు ప్రాంతంలో బాలికను వదిలేసి వెళ్లిపోయారు.''
- పోలీసులు