Gang Rape In Bus: బిహార్ పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో దారుణం జరిగింది. బస్సులోనే ఓ మైనర్పై లైంగిక దాడి జరిగింది. బస్సు డ్రైవర్, కండక్టర్, హెల్పర్ కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటన మంగళవారం జరిగినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
బస్సు పట్నాకు వెళ్తుందని చెప్పి బాలికను ఎక్కించుకున్నాడు డ్రైవర్. కాసేపటికి కండక్టర్, హెల్పర్లను వెంటబెట్టుకొని బస్సును.. బస్టాండ్ నుంచి బయటకు తీశాడు. బైపాస్ రోడ్డు వద్ద బస్సును ఆపి.. ఆ తర్వాత బాలికకు మత్తుపదార్థాలు కలిపిన పానీయాన్ని ఇచ్చాడు. బాలిక స్పృహతప్పి పడిపోగానే.. నిందితులు ఆమెపై బస్సులో సామూహిక అత్యాచారం చేశాడు. అనంతరం బస్సును లాక్ చేసి డ్రైవర్ పారిపోయాడు.
బాలిక స్పృహలోకి రాగానే బస్సు తలుపులను గట్టిగా కొట్టింది. దారిన వెళ్లేవారు గమనించి డోర్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలికను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల కోసం తరలించారు. ఈ ఘటనపై బాలిక నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. బస్సును సీజ్ చేశారు.
బాబాతో పెళ్లి.. ఆ తర్వాత..?
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో బాబా మోసానికి ఓ మహిళ బాధితురాలిగా మారింది. ఆ బాబాను వివాహం చేసుకున్న మహిళ.. కొద్దిరోజులుగా ఆచూకీ లేకుండా పోయింది. మహిళ కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమెను వెతికి పెట్టుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.