బిహార్ సమస్తిపుర్లో దారుణం జరిగింది. 13 ఏళ్ల మైనర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కామాంధులు. అనంతరం ఆమె ప్రైవేట్ భాగాలు, నాలుకను కోసేశారు. నవంబర్ 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కళ్యాణ్పుర్కు చెందిన బాలికను ఇంటిలో నుంచి ఎత్తుకెళ్లిపోయారు నిందితులు. పక్కనే ఉన్న తోటలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి ప్రైవేట్ భాగాలు, నాలుకను కోసేసి.. విచక్షణా రహితంగా దాడి చేసి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకుంది. బాలికను గమనించిన గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విరాళాలు సేకరించి బాలికకు వైద్యం చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థతి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.