ప్రేమ వ్యవహారంలో ఓ మైనర్ మరో మైనర్‌ను గొంతునులిమి హత్య చేశాడు. ఆపై తానే ఈ నేరం చేశానని పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ జాంజ్‌గిర్- చంపా జిల్లాలో జరిగింది.
అసలేమైందంటే...
బిర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని కికిర్దా గ్రామానికి చెందిన.. మైనర్లు పాఠశాలలో కలసి చదివే సమయంలో ప్రేమించుకున్నారు. శనివారం రాత్రి 12 గంటల సమయంలో బాలికను కలవాలని అతడు పిలిచాడు. నది ఒడ్డున కూర్చున్న సమయంలో తనను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువెళ్లాలని ఆమె అతడిపై ఒత్తిడి తెచ్చింది.
అందుకు ఆ మైనర్ నిరాకరించాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన అతడు తన ప్రియురాలి గొంతు నులిమి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం హత్యా నేరం నుంచి తప్పించుకోవడానికి మృతదేహాన్ని నదిలో పారేశాడని చెప్పారు. కానీ, మళ్లీ తానే పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడని చెప్పారు.
విషయం తెలుసుకున్న పోలీసులు... ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో మూడు గంటలపాటు శ్రమించి నదిలో నుంచి యువతి మృతదేహాన్ని వెలికి తీశారు. నిందితుడు, మృతురాలు మైనర్లే అని చెప్పారు.
ఇదీ చూడండి:ప్రేమ అని భ్రమించా... జీవితాన్ని కూలదోశా!
ఇదీ చూడండి:మైనర్ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడు మృతి