తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మామిడి పండ్లు ఆశ చూపి.. ఏడేళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడు రేప్​ - ఛత్తీస్​గఢ్​ న్యూస్​

minor boy raped minor girl: ఛత్తీస్​గఢ్​​ సూరజ్​పుర్​ జిల్లాలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ 12 ఏళ్ల బాలుడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. లాక్​డౌన్​ సమయంలో ఆన్​లైన్​ తరగతులకు హాజరవుతూ.. పోర్న్ వీడీయోలు చూడడమే దీనికి కారణామని అనుమానిస్తున్నారు.

minor boy raped minor girl
minor boy raped minor girl

By

Published : May 24, 2022, 11:12 AM IST

minor boy raped minor girl: ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు 12ఏళ్ల బాలుడు. మామిడి పండ్లు ఇస్తానని బాలికను ప్రలోభపెట్టి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఛత్తీస్​గఢ్​లోని సూరజ్​పుర్​ జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చైల్డ్​లైన్​ అధికారుల సహాయంతో బాలుడిని విచారిస్తున్నారు. లాక్​డౌన్​ సమయంలో ఆన్​లైన్​ తరగతులకు హాజరవుతూ.. పోర్న్ వీడియోలు చూడడమే దీనికి కారణామని అధికారులు అనుమానిస్తున్నారు.

బాలుడి ఇంటికి సమీపంలో నివసించే ఏడేళ్ల బాలిక.. ఇంటి సమీపంలోని చెట్టుకు మామిడి పండ్లు కోయడానికి ప్రయత్నించింది. ఇది గమనించిన బాలుడు తాను ఇస్తానంటూ బాలికను నమ్మబలికాడు. తనతో పాటు చిన్నారిని ఇంటి వెనుక ఉన్న పశువుల కొట్టానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత బాలిక ఏడుస్తూ ఇంటికి పరుగెత్తింది. బాలిక ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. బాలికను పరిశీలించిన వైద్యులు.. అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ABOUT THE AUTHOR

...view details