యూపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బులంద్‌షహర్‌లో అన్నా, చెల్లెళ్ల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం.. ఏకంగా బాలిక ప్రాణాల్నే బలిగొంది. ఆ తర్వాత తన అన్నయ్య సాయంతో ఆ బాలికను అడవిలో పాతిపెట్టాడా బాలుడు.
ఏం జరిగిందంటే?

బులంద్‌షహర్ జిల్లా మక్సుదాబాద్ గ్రామానికి చెందిన మైనర్ అన్నాచెల్లెళ్లు గోధుమ పంట పండిస్తున్నారు. ఇద్దరూ కలిసి పొలానికెళ్లగా.. పంటకోత విషయంలో అక్కడ ఇరువురి మధ్య స్వల్ప ఘర్షణ తలెత్తింది. ఈ వివాదంలో సోదరి తలపై కర్రతో పదేపదే కొట్టాడా బాలుడు. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం.. అన్నయ్య సాయంతో ఆ బాలిక మృతదేహాన్ని కాలువ సమీపంలోని ఓ అడవిలో పూడ్చిపెట్టాడు.
ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటికే ఓ నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.