Minor Boy Bank Theft: పంజాబ్ పటియాలాలో షాకింగ్ ఘటన జరిగింది. షెరాన్వాలా గేట్ ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 35 లక్షలు కాజేశాడు ఓ బాలుడు. సీసీటీవీల్లో సంబంధిత దృశ్యాలు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా.. బాలుడిని వెతికి పనిలో పడ్డారు పోలీసులు.
25 ఏళ్ల ఓ యువకుడితో బాలుడు బ్యాంకులోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. 25 నిమిషాల పాటు రెక్కీ నిర్వహించి.. ఎవరి కంటా పడకుండా డబ్బు దోచుకెళ్లారని వివరించారు. ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సిన డబ్బును.. బ్యాంకు అధికారి క్యాష్ కౌంటర్ బయట ఉంచిన సమయంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది.