Minor Alcohol Consumption: మధ్యప్రదేశ్లోని ఛతార్పుర్ జిల్లాలో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. పెద్దలు ఆల్కహాల్ తాగుతుంటే చూసి పిల్లలు కూడా మద్యాన్ని సేవించారు. అయితే.. పరిమితికి మించి మందు తాగడం వల్ల ఆస్పత్రి పాలయ్యారు.
మందు కొట్టిన పిల్లలు.. పరిస్థితి విషమం.. పెద్దల్ని చూసి నేర్చుకుని...
Minor Alcohol Consumption: పిల్లలు ఎప్పుడూ పెద్దలను అనుసరిస్తుంటారు. మంచైనా.. చెడైనా.. ఆ పనులనే చేస్తుంటారు. మధ్యప్రదేశ్లో పెద్దలు ఆల్కహాల్ తాగడం చూసి పిల్లలు కూడా మద్యం సేవించారు. పరిమితికి మించి తాగి ఆస్పత్రి పాలయ్యారు.
నౌగాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్రి గ్రామంలో రాజుకు పన్నేండేళ్ల కుమారుడు ఉన్నాడు. అప్పటికే పెద్దలు మందు కొట్టడం చూసిన ఆ బాలుడు.. స్నేహితులతో కలిసి ఆల్కహాల్ బాటిల్ తీసుకుని పొలాల్లోకి వెళ్లాడు. రాజు కుమారుడు పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకుని అక్కడే పడిపోయాడు. అయితే.. తక్కువ మద్యాన్ని తాగిన ఓ బాలుడు ఇంటికి వచ్చి విషయం తెలిపాడు. తల్లిదండ్రులు వెంటనే వెళ్లి ఆ బాలుడ్ని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించగా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చదవండి:భాజపా తరఫున ప్రచారం.. ముస్లిం యువకుడ్ని కొట్టి చంపిన స్థానికులు