Omicron Cases in India: భారతదేశంలో ఇప్పటివరకు 25 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజస్థాన్‌లో తొమ్మిది, గుజరాత్‌లో మూడు, మహారాష్ట్రలో 10, కర్ణాటకలో రెండు, దిల్లీలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయని వివరించింది. అయితే వీరందరిలో అత్యంత స్వల్ప లక్షణాలే ఉన్నట్లు పేర్కొంది.
Omicron Variant Symptoms: ఈ వేరియంట్‌తో ఆరోగ్య వ్యవస్థపై ఇంకా భారం పడలేదని.. అయితే అప్రమత్తంగా ఉండటం ముఖ్యమని అభిప్రాయపడింది. మహమ్మారి విజృంభణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలను వెల్లడించింది.
- దేశంలోని 19 జిల్లాల్లో వారం వ్యవధిలోనే కొవిడ్ పాజిటివిటీ 5 నుంచి 10 శాతం పెరిగింది. మూడు రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల్లో ఇది 10 శాతానికి పైగా ఉంది.
- 5% కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న చోట జిల్లా స్థాయి ఆంక్షలు విధించాలి.
- 18ఏళ్లు పైబడిన వారిలో 86.2 శాతం మందికి కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు పూర్తి కాగా.. 53.5 శాతం మంది రెండు డోసులను అందుకున్నారు.
Mask Usage in India: మాస్క్ వినియోగంలో అశ్రద్ధ చూపొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించిందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు.