తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వన్ డిస్ట్రిక్ట్ వన్ ఫోకస్ ప్రొడ్యూస్- పంటల జాబితా సిద్ధం

సాగు ఉత్పత్తుల విలువ పెంచేందుకు 'వన్ డిస్ట్రిక్ట్ వన్ ఫోకస్ ప్రొడ్యూస్'కు వ్యవసాయ ఉత్పత్తుల జాబితాను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సిద్ధం చేసింది. రైతు ఆదాయం పెంపు లక్ష్యంగా క్లస్టర్ విధానాన్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేసింది.

ministry of agriculture  on one district one focus produce
'వన్ డిస్ట్రిక్ట్ వన్ ఫోకస్ ప్రొడ్యూస్'- సాగు ఉత్పత్తి విలువ పెంచే దిశగా..

By

Published : Feb 27, 2021, 7:35 PM IST

Updated : Feb 27, 2021, 7:48 PM IST

సాగు ఉత్పత్తుల విలువ పెంచేందుకు కేంద్రం సరికొత్త విధానాన్ని సిద్ధం చేసింది. 'వన్ డిస్ట్రిక్ట్ వన్ ఫోకస్ ప్రొడ్యూస్'కు వ్యవసాయ ఉత్పత్తుల జాబితాను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ రూపొందించింది. రైతు ఆదాయం పెంపు లక్ష్యంగా క్లస్టర్ విధానాన్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేసింది.

సాగు ఉత్పత్తుల జాబితా వెల్లడికి రాష్ట్రాల అభిప్రాయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది. వ్యవసాయ, ఆహారశాఖ కలిసి చర్చించాకే జాబితా ఖరారు చేశామని వెల్లడించింది. ఆయా ఉత్పత్తులకు పీఎం-ఎఫ్‌ఎంఈ పథకం కింద సహకారం అందించనున్నట్లు పేర్కొంది. ప్రమోటర్స్, సూక్ష్మ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చింది. రైతులకు లబ్ధి జరిగే ప్రణాళిక అమలు చేయాలని రాష్ట్రాలను కోరింది.

వన్ డిస్ట్రిక్ట్ వన్ ఫోకస్ ప్రొడ్యూస్ కార్యక్రమం కింద ఉత్పత్తుల జాబితాకు ముందు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాలను తీసుకున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం. వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరిపిన తరువాత జాబితా ఖరారు చేసింది. గుర్తించిన ఉత్పత్తులకు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క 'పీఎం- ఎఫ్​ఎమ్​ఈ' పథకం కింద సహకారం ఉంటుందని కేంద్రం తెలిపింది.

అనేక ఉత్పత్తులలో వనరుల కలయిక, ఇతర విభాగాల విధానం కూడా ఉన్నాయని వివరించింది.

వన్ డిస్ట్రిక్ట్ వన్ ఫోకస్ ప్రొడ్యూస్ కార్యక్రమానికి పలు కేంద్ర ప్రాయోజిత పథకాల నుండి సహకారం అందించేందుకు వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటుంది.

అందువల్ల ప్రత్యేక నిధులు అవసరం లేదు.

మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ కూడా ఇలాంటి దాని కోసం అభ్యర్థించింది.

రైతులకు ప్రయోజనం, ఉత్పత్తుల విలువను పెంచడం, వ్యవసాయ రంగ ఉత్పత్తుల ఎగుమతిని పెంచడానికి సహాయపడే ఈ ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర వ్యవసాయ శాఖ కోరింది.

ఆయా రాష్ట్రాల అభిప్రాయాలకు అనుగుణంగా.. ప్రతి జిల్లాకు ఒక పంటను కేటాయించింది కేంద్ర వ్యవసాయ శాఖ.

కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించిన జాబితా ప్రకారం..

ఆంధ్రప్రదేశ్‌

  • అనంతపురం- వేరు శనగ
  • చిత్తూరు - టమాటా
  • తూర్పు గోదావరి - కొబ్బరి
  • గుంటూరు - మిరప, పసుపు
  • కడప - అరటి
  • కృష్ణా - మామిడి
  • కర్నూలు - ఉల్లి
  • నెల్లూరు - నిమ్మ
  • ప్రకాశం - మిరప, పసుపు
  • శ్రీకాకుళం - జీడి
  • విశాఖపట్నం - చెరకు
  • విజయనగరం - మామిడి
  • పశ్చిమ గోదావరి - చేపలు

తెలంగాణ

  • అదిలాబాద్‌ - సోయాబీన్‌
  • భద్రాద్రి కొత్తగూడెం - మిరప
  • హైదరాబాద్‌ - ఆర్‌టిఈ స్నాక్స్‌
  • జగిత్యాల - మామిడి
  • జనగాం - చిట్టిముత్యాలు
  • జయశంకర్‌ భూపాల్‌పల్లి - మిరప
  • జోగులాంబ గద్వాల - వేరుశనగ
  • కామారెడ్డి - సోయాబీన్‌
  • కరీంనగర్‌ - వరి
  • ఖమ్మం - మిరప
  • కొమరం భీం - తృణధాన్యాలు
  • మహబూబాబాద్‌ - మిరప
  • మహబూబ్‌నగర్‌ - తృణధాన్యాలు
  • మంచిర్యాల - మామిడి
  • మెదక్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి - తినడానికి సిద్దంగా ఉన్న పదార్ధాలు(రెడీ టు ఈట్‌ స్నాక్స్‌)
  • ములుగు - మిరప
  • నాగర్‌కర్నూలు - మామిడి
  • నల్లగొండ - కమలా పండ్లు (స్వీట్‌ ఆరెంజ్‌)
  • నారాయణపేట - వేరు శనగ
  • నిర్మల్‌ - సోయాబీన్‌
  • నిజామాబాద్‌ - పసుపు
  • పెద్దపల్లి - వరి
  • రాజన్న సిరిసిల్ల - చేపలు
  • రంగారెడ్డి - కూరగాయలు
  • సంగారెడ్డి - పాల ఉత్పత్తులు
  • సిద్దిపేట - కూరగాయలు
  • సూర్యాపేట - పాల ఉత్పత్తులు
  • వికారాబాద్‌ - కూరగాయలు
  • వనపర్తి - వేరు శనగ
  • వరంగల్‌ గ్రామీణ - బ్యాంబు చిల్లి
  • వరంగల్‌ పట్టణ - తినడానికి సిద్దంగా ఉన్న పదార్ధాలు(రెడీ టు ఈట్‌ స్నాక్స్‌)
  • యాదాద్రి భువనగిరి - పాల ఉత్పత్తులు

ఇదీ చదవండి :'ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా టీకా ధర రూ.250 మించొద్దు'

Last Updated : Feb 27, 2021, 7:48 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details