తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Neera Cafe: హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ను ప్రారంభించిన మంత్రులు

Neera Cafe in Hyderabad: హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఇరువురూ నీరా కేఫ్, ఫుడ్ కోర్టులు కలియ తిరిగారు. ఈ నీరాకేఫ్​ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు.

neera cafe
neera cafe

By

Published : May 3, 2023, 1:31 PM IST

Updated : May 3, 2023, 5:07 PM IST

హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ను ప్రారంభించిన మంత్రులు

Neera Cafe in Hyderabad: గీత కార్మికుల ఆత్మగౌరవానికి ప్రతీకగానే నెక్లెస్‌ రోడ్‌లో నీరాకేఫ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గౌడ కులస్థులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు కేసీఆర్‌ సర్కార్ ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన నీరా కేఫ్, ఫుడ్‌ కోర్టులను మంత్రి తలసానితో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా నీరా కేఫ్, ఫుడ్ కోర్టులు మంత్రులు కలియతిరిగారు. ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ నీరా ఉప ఉత్పత్తులైన తాటిబెల్లం, స్వచ్ఛమైన తేనె, బూస్ట్, పంచదార పరిశీలించారు. త్వరలో నీరా ఐస్‌క్రీం, తాటి ముంజల ఐస్‌క్రీం ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నీరా శుద్ధి యంత్రాలను మంత్రులు ప్రారంభించారు.

కర్ణాటక నుంచి వచ్చిన స్వామీజీలతో కలిసి వేదికపై నీరా సేవించి.. ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న అమృతంగా పేర్కొన్నారు. ఎంతో అవమానాలకు గురైన గౌడ కులస్థులను.. ఎన్నో కష్టాలతో వృత్తిని సాగిస్తున్న కార్మికులకు కేసీఆర్‌ ప్రభుత్వం కొండంత అండగా నిలిచిందని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఇది వేదామృతమని పేర్కొన్నారు. దేవతలు తాగే అమృతమని.. స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధంగా లభిస్తున్నదని వివరించారు.

గీత వృత్తి తరరతాల నుంచి వస్తోంది అని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ తరహా నీరా కేఫ్ లేదని పేర్కొన్నారు. ఇది ఆత్మగౌరవానికి‌ ప్రతీక అని వివరించారు. బహుళ పోషకాల గని నీరా అని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. జంట నగరవాసులు వారాంతపు రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సాగర తీరంలో కొలువై ఉన్న ఈ కేఫ్‌లో రుచికరమైన నీరా సేవించవచ్చని తెలిపారు. దీంతో పాటు తెలంగాణ సాంప్రదాయక వంటకం సర్వపిండి గన్నెప్ప, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పానీపూరీ, బూందీ, పల్లి చిక్కీలు, ఐస్‌క్రీంలు ఆస్వాదిస్తూ ఆహ్లాదకరంగా గడపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

"నీరా అంటే ఆల్కహాల్ అని దుష్ప్రచారం‌ ఉంది. ఇది వేదామృతం. దేవతలు తాగే అమృతం. స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న అమృతం. తరరతాల నుంచి వస్తున్న గీత వృత్తి. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ తరహా నీరా కేఫ్ లేదు. ఇది తెెలంగాణ ఆత్మగౌరవానికి‌ ప్రతీక." -శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్​శాఖ మంత్రి

ఇవీ చదవండి:Neera Cafe in Hyderabad: హుస్సేన్​సాగర్ తీరాన నీరా కేఫ్​.. నేడే ప్రారంభం..

CLP Bhatti Vikramarka : 'ఏదో రోజు.. తెలంగాణను ఏ రాష్ట్రానికో తాకట్టు పెట్టేస్తారు'

స్వలింగ సంపర్క జంటలపై కేంద్రం కీలక నిర్ణయం.. సమస్యల పరిష్కారానికి కమిటీ

Last Updated : May 3, 2023, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details