కరోనా నివారణపై గతంలో అనేక సంచలన వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక మంత్రి ఉషా ఠాకూర్.. తాజాగా వైరస్ నుంచి విముక్తి కోసం పూజలు చేశారు. ఇందోర్ విమానాశ్రయంలో దేవీ అహిల్య భాయి హోల్కర్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి కీర్తనలు పాడుతూ, భజన చేశారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
వైరల్: కరోనా నివారణకు మంత్రి పూజలు - మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాకూర్
కరోనా నుంచి విముక్తి కలిగించాలని పూజలు చేశారు మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాకూర్. ఆమె గతంలో వైరస్ వ్యాప్తి కట్టడికి మాస్కులు ధరించనవసరం లేదని.. యజ్ఞాలు చేస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు.
వైరల్: కరోనా నివారణకు మంత్రి పూజలు
కొవిడ్ నుంచి రక్షణగా మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఉషా ఠాకూర్. బదులుగా యజ్ఞాలు, హిందూ వేద పద్ధతులను అవలంబించాలని పిలునివ్వడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీ చూడండి:క్షుద్రపూజల పేరిట యువతిపై అత్యాచారం