తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిల్లలపై మంత్రి కుమారుడి కాల్పులు.. అనేక మందికి గాయాలు! - బిహార్​ మంత్రి కుమారుడు కాల్పుల

Minister son gun fire: మంత్రి ఇంటి పక్కన ఉన్న మామిడి తోటలో పిల్లలంతా చేరి ఆటలు ఆడుకోవడం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆవేశంలో మంత్రి కుమారుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, అనుచరులతో కలిసి దాడి చేయగా.. అనేక మంది గాయపడ్డారు.

minister-son-gun-fire
మంత్రి కుమారుడు బబ్లూతో గొడవపడుతున్న స్థానికులు

By

Published : Jan 23, 2022, 7:13 PM IST

Updated : Jan 23, 2022, 8:08 PM IST

పిల్లలపై మంత్రి కుమారుడి కాల్పులు

Minister son gun fire: బిహార్ పర్యటక శాఖ మంత్రి నారాయణ ప్రసాద్ కుమారుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తన సిబ్బందితో కలిసి కనిపించినవారందరినీ చితకబాదాడు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని బాధితుడి బంధువులు చెబుతున్నారు.

అసలేం జరిగింది?

పశ్చిమ చంపారన్ జిల్లా బేతియా సమీపంలోని హర్దియా గ్రామంలో భాజపా నేత నారాయణ ప్రసాద్ సాహ్​ ఇల్లు ఉంది. ఆ పక్కన ఉన్న మామిడి తోటలో కొందరు పిల్లలు చేరి ఆడుకుంటున్నారు. అయితే.. అక్కడ ఆటలు ఆడేందుకు వీలు లేదని, తక్షణమే వెళ్లిపోవాలని మంత్రి కుమారుడు బబ్లూ ప్రసాద్ సాహ్​, అతడి ఇంటి సిబ్బంది చెప్పారు. ఇందుకు పిల్లలు నిరాకరించగా.. కొందరు పెద్దలు కూడా వారికి తోడయ్యారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

మంత్రి కుమారుడు బబ్లూతో గొడవపడుతున్న స్థానికులు

దీంతో వెనక్కి వెళ్లి నాలుగు వాహనాల్లో అనుచరులను తీసుకువచ్చాడు బబ్లూ. అక్కడున్న వారిని చెదరకొట్టేందుకు బబ్లూ, అనుచరులు వారిపై దాడికి దిగారు. అంతేగాకుండా తుపాకీ చూపించి బెదిరించారు. ఒకానొక దశలో ఆవేశంతో ఊగిపోయిన బబ్లూ ప్రసాద్​.. ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జనార్ధన్​ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అతని సోదరుడు తెలిపారు.

మంత్రి వాహనాన్ని ధ్వంసం చేసిన స్థానికులు

కాల్పుల గురించి తెలిసిన వెంటనే గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అంతా కలిసి మంత్రి ఇంటిపైకి దండెత్తారు. ఈలోగా బబ్లూ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు మంత్రి వాహనాన్ని ధ్వంసం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మంత్రి ఇంటి నుంచి ఒక పిస్టల్​ను, ఒక రైఫిల్​ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతవరకు మంత్రి కుమారుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:త్వరలోనే మా మంత్రి అరెస్ట్: దిల్లీ సీఎం

Last Updated : Jan 23, 2022, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details