Minister Son Get Peon Job In Jharkhand : ఝార్ఖండ్‌కు చెందిన లేబర్ ప్లానింగ్ ప్లానింగ్, ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మంత్రి కుమారుడు సివిల్ కోర్టులో బంట్రోతు ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అలానే ఆ మంత్రి మేనల్లుడు పేరు సైతం వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది. నాలుగో తరగతి అయిన బంట్రోతు ఉద్యోగానికి, ఓ మంత్రి కుమారుడు ఎంపిక కావటం వల్ల జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
శుక్రవారం చతరా జిల్లా సివిల్ కోర్ట్ నాలుగో తరగతి ఉద్యోగాల నియామక ఫలితాలను విడుదల చేసింది. ఇందులో మొత్తం 19 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అయితే ఈ లిస్ట్‌లో ఝార్ఖండ్ లైబర్ ప్లానింగ్, ట్రైనింగ్ అండ్ స్కిల్ డెలవప్మెంట్ మంత్రి సత్యానంద్ భోక్తా కుమారుడు ముఖేశ్ కుమార్ భోక్తా పేరు కూడా ఉంది. అయితే మంత్రి కుమారుడిని నాలుగో తరగతి ఉద్యోగమైన బంట్రోతుగా ఎంపిక చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన మంత్రి, ఇప్పుడు కుమారుడికి బంట్రోతుగా ఉద్యోగం ఇప్పిస్తారా అని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మఖేశ్ కుమార్‌కు గత ఏడాది డిసెంబర్లోనే వివాహం జరిగింది.