తెలంగాణ

telangana

ETV Bharat / bharat

MIM, Telangana Assembly Election Results 2023 Live : బరిలో నిలిచిన ఏడు స్థానాల్లో ఎగిరిన గాలిపటం - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023

MIM, Telangana Assembly Election Results 2023 Live : తెలంగాణలో ఎన్నికల్లో​ ఎంఐఎం తమ సత్తా చాటింది. పోటీ చేసిన ఏడు స్థానాల్లో ఎంఐఎం పార్టీ విజయఢంకా మోగించింది. బీఆర్ఎస్‌కు, ఎంఐఎంకు మధ్య స్నేహపూర్వక అవగాహన ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

MIM Telangana Assembly Election Results 2023 Live
MIM

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 12:47 PM IST

Updated : Dec 3, 2023, 10:42 PM IST

MIM, Telangana Election Results 2023 Live :తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ స్థానాలను మరోమారు సొంతం చేసుకుంది ఎంఐఎం పార్టీ. చాంద్రాయణ గుట్ట, చార్మినార్ సహా, బహదూర్ పురా, మలక్​పేట, నాంపల్లి, యాకుత్ పురా, కార్వాన్ స్థానాల్లో తిరిగి విజయఢంకా మోగించింది. నాంపల్లిలో కాంగ్రెస్అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ 2,581 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక యాకుత్ పురా లోనూ కేవలం 878 ఓట్ల మెజారిటీ ఆ పార్టీ గెలుపొందింది. ఎంఐఎం తరఫున బరిలో దిగి గెలిచిన ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, మీర్ జుల్ఫికర్, మోహమ్మద్ ముబీన్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, మహ్మద్ మాజిద్ హుస్సేన్, కౌసర్ మోహియుద్దీన్​లు పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీని కలిశారు. దారుస్సలాంలోని పార్టీ కార్యాలయంలో కలిసిన ఎమ్మెల్యేలను అసదుద్దీన్ అభినందించారు.

Telangana Election Results 2023 Live :హైదరాబాద్ జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం(Charminar Constituency) ఒకటి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం నేత ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ చార్మినార్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అంతకుముందు ఆయన యాకుత్‌ పురా నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయఢంగా మోగించారు. చార్మినార్‌లో మూడుసార్లు గెలిచిన ఖాద్రీ పాషాను యాకూత్‌ పురాకు మార్చింది మజ్లిస్ పార్టీ. అక్కడ ఆయన నాలుగోసారి గెలిచారు. అహ్మద్‌ ఖాన్‌ 1994లో ఎంబీటీ తరపున పోటీ చేసి విజయఢంగా మోగించారు. అనంతరం మజ్లిస్‌లో చేరి వరస ఎన్నికల్లో గెలిచారు. 2018 ఎన్నికల్లో మజ్లిస్ నేత అహ్మద్‌ ఖాన్‌ బీజేపీ నేత ఉమా మహేంద్రపై 32,886 ఓట్ల తేడా విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీ చేసిన మహ్మద్‌ గౌస్‌కు 15,700 ఓట్లు వచ్చాయి.

Telangana Election Result 2023 LIVE Telangana Overall Politics : మార్పు మంత్రానికే ఓటు - 64 స్థానాలతో సంపూర్ణ ఆధిక్యాన్ని సాధించిన హస్తం

2018 ఎన్నికల్లో ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌కు 53,808 ఓట్లు రాగా, ఉమా మహేంద్రకు 21,222 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్‌లోని చారిత్రాత్మకమైన చార్మినార్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 1967 నుంచి మజ్లిస్‌ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. సలావుద్దీన్‌ ఓవైసీ పెద్దకుమారుడైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ చార్మినార్‌లో రెండుసార్లు విజయఢంకా మోగించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి టీడీపీ నేత ఎంఏ బషిత్​పై గెలుపొందారు. సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి 62,941 ఓట్లు రాగా, టీడీపీ నేత ఎంఏ బషిత్​కు 26, 326 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఏడు నియోజకవర్గాల్లో బరిలో నిలిచి గెలుపొందిన ఎంఐఎం అభ్యర్థులు వీళ్లే :

  • నాంపల్లి - మాజిద్‌ హుస్సేన్‌
  • మలక్‌పేట - బలాల
  • కార్వాన్‌ - మొహిద్దీన్‌
  • చాంద్రాయణగుట్ట - అక్బరుద్దీన్‌
  • బహదూర్‌పురా - మహమ్మద్‌ ముబీన్‌
  • చార్మినార్‌ - మీర్‌ జుల్ఫికర్‌ అలీ
  • యాకూత్‌ పురా - జాఫర్ హుస్సేన్

Telangana Assembly Elections Result Live 2023 : హైదరాబాద్ చేరుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, గచ్చిబౌలి హోటల్​లో మకాం

Last Updated : Dec 3, 2023, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details