MIM Asaduddin Owaisi Election Campaign in Telangana :హైదరాబాద్ పాతబస్తీపై.. పతంగి పార్టీకి గట్టి పట్టు ఉంది. మజ్లిస్‌కు ఏడు స్థానాలు వదిలేసి మిగతా సీట్లపై ప్రధాన పార్టీలు దృష్టి పెడతాయంటే.. అతిశయోక్తి కాదు. బరిలో నిలిచేందుకు అభ్యర్థులు ఉంటే చాలు అని భావిస్తాయి. పాతబస్తీలో వేరే పార్టీల ఉనికిని సైతం మజ్లిస్ సహించదు. పతంగి పార్టీ వాళ్లు.. ఇతర పార్టీల కార్యకర్తలపై దాడులు(Activists Attacks) దిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి.పాతబస్తీపై పట్టుసడిలించకూడదనే పట్టుదలతో మజ్లిస్.. ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగింది. సిట్టింగ్ స్థానాలైన చార్మినార్, చంద్రాయణ్‌గుట్ట, బహదూర్‌పుర, మలక్‌పేట్, యాకుత్‌పుర, కార్వాన్, నాంపల్లితోపాటు రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్‌లోనూ పోటీ చేస్తోంది.
హైదరాబాద్‌పై ఈసారి పట్టు ఎవరిదో? సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన పార్టీలు
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ... ఈసారి అచితూచి అభ్యర్థుల ఎంపిక చేశారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. వ్యతిరేకత ఉన్న నాంపల్లి ఎమ్మెల్యేకు స్థానచలనం కల్పించారు. చంద్రాయణ్‌గుట్ట నుంచి అక్బరుద్దీన్, కార్వాన్-ఖౌసర్ మొయినోద్దీన్, మలక్‌పేట్-అహ్మద్ బలాలకు మరోసారి అవకాశం ఇచ్చారు. చార్మినార్(Charminar), బహదూర్‌పుర, యాకత్‌పురలో సిట్టింగ్‌లకు టిక్కెట్ ఇవ్వలేదు. యాకుత్‌పురలో సిట్టింగ్ ఎమ్మెల్యే పాషా ఖాద్రి అనారోగ్య కారణాల రీత్యా తప్పుకోగా.. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మీరాజ్ జాఫర్ హుస్సేన్‌ను బరిలోకి దింపారు.
MIM Party Election Campaign in Hyderabad : నాంపల్లి నుంచి మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ పోటీ చేస్తున్నారు. రాజేంద్రనగర్ నుంచి స్వామి యాదవ్, జూబ్లిహిల్స్ నుంచి షేక్‌పేట్ కార్పొరేటర్ రషీద్‌ను బరిలోకి దించారు. చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్‌ను తప్పించి.. మాజీ మేయర్ మీర్ జుల్ఫికర్ అలీకి అవకాశం ఇచ్చారు. తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని ముంతాజ్ ఖాన్ అడిగినా.. మజ్లిస్ నిరాకరించింది. ఎంఐఎంపై అసంతృప్తితో ముంతాజ్‌ఖాన్.. కాంగ్రెస్, ఎంబీటీ నుంచి పోటీ చేస్తారని భావించారు.
MIM Meeting in Zahirabad : మామను గెలిపించండి.. పవర్ ప్లేలో మా తడాఖా చూపిస్తాం : అసదుద్దీన్ ఓవైసీ