ఉగ్రమూకలతో సంబంధాలు ఉన్న వ్యక్తిని సైన్యం అదుపులోకి తీసుకుంది. కశ్మీర్ జిల్లాలోని హతిపురలో తనిఖీలు చేస్తుండగా నిందితుడు దొరికినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద నుంచి మారణాయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఉగ్ర అనుచరుడు అరెస్టు- ఆయుధాలు స్వాధీనం - కశ్మీర్లో ఉగ్రవాద కదలికలు
కశ్మీర్లో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఓ వ్యక్తిని భద్రతాదళాలు అరెస్టు చేశాయి. అతని వద్ద నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులో సంబంధాలున్న వ్యక్తి అరెస్టు-ఆయుధాలు స్వాధీనం
నిందితుని వద్ద చైనా పిస్టల్, చైనా గ్రెనేడ్, 28 రౌండ్లతో ఉండే ఏకే-47 మ్యాగజైన్లు, ఒక దిక్చూచి దొరికాయి.
ఇదీ చూడండి: ఉగ్రవాద స్థావరం గుట్టురట్టు- పిస్టల్స్, గ్రెనేడ్లు స్వాధీనం