జమ్ముకశ్మీర్, బారాముల్లా జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై గ్రనేడ్ విసిరారు.
శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు సోపోర్‌లోని ఎస్బీఐ మెయిన్ చౌక్ ప్రాంతంలో ఈ దాడి జరిగిందని ఓ పోలీసు అధికారి తెలిపారు.
అయితే.. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. దాడి అనంతరం ఘటనాస్థలిలో భద్రతా సిబ్బంది భారీగా మోహరించారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
పంజాబ్‌లో గ్రనేడ్ కలకలం
పంజాబ్ అమృత్‌సర్‌లోని పాశ్ ప్రాంతంలో ఓ గ్రనేడ్ తరహా బాంబు కనిపించడం కలకలం రేపింది. పారిశుద్ధ్య కార్మికులు దీన్ని గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఘటనాస్థలికి పోలీసులు, బాంబు నిర్వీర్యం చేసే సిబ్బంది చేరుకున్నారు.
గ్రనేడ్ బాంబు కనిపించిన స్థలంలో పోలీసులు ఘటనాస్థలిలో యాంటీ బాంబు స్క్వాడ్ సిబ్బంది బాంబును వాహనంలో తరలిస్తున్న పంజాబ్ పోలీసులు నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి ఆ బాంబును నిర్వీర్యం చేసినట్లు అధికారులు చెప్పారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:కశ్మీర్లో ఎన్కౌంటర్- ఉగ్రవాది హతం
ఇదీ చూడండి:భాజపా నేత ఇంట్లో పేలుడు- ఒకరు మృతి