తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Militants Firing: రెచ్చిపోయిన ఉగ్రమూక- పోలీస్​పై కాల్పులు - jammu kashmir pulwama news

Militants Firing On Police: జమ్ముకశ్మీర్​లో ఓ​ పోలీస్​ ఫాలోవర్​పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సదరు అధికారి గాయపడ్డారు.

militants firing
పోలీసులపై ఉగ్రవాదుల కాల్పులు

By

Published : Dec 19, 2021, 10:19 PM IST

Militants Firing On Police: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా బంద్​జూ ప్రాంతలో ఓ పోలీసు ఫాలోవర్​పై కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో సదరు అధికారికి గాయాలయ్యాయి.

"బంద్​జూ ప్రాంతంలోని జమ్ముకశ్మీర్​ పోలీస్​ ఫాలోవర్ ముస్తాక్ అహ్మద్ వాగే ఇంటి వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వాగే కాలికి గాయమైంది. సాయంత్రం 7 గంటలకు ఈ ఘటన జరిగింది" అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ముస్తాక్​ను స్థానికులు పుల్వామా జిల్లా ఆస్పత్రికి తరలించారని వెల్లడించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను శ్రీనగర్​లో ఎస్​ఎంహెచ్ఎస్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- పాక్​ ఉగ్రవాది హతం

ABOUT THE AUTHOR

...view details