Militants attack srinagar: జమ్ముకశ్మీర్‌లో ముష్కరులు రెచ్చిపోయారు. సోను కుమార్ బల్జీ అనే కశ్మీర్ పండిట్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. బాధితుడికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. బాధితుడు దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన వాడని చెప్పారు. చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు.
శ్రీనగర్‌లో కశ్మీర్ పండిట్‌పై ముష్కరుల కాల్పులు - pulwama attack
Militants attack srinagar: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. సోమవారం సాయంత్రం కశ్మీర్ పండిట్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటన శ్రీనగర్‌లో జరిగింది.
దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఆ ప్రాంతాన్ని నిర్బంధించి గాలింపు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో లోయలో ఇది నాల్గవ ఉగ్రదాడి అని అధికారులు చెప్పారు. అంతకుముందు.. ఇద్దరు స్థానికేతరులపై పుల్వామాలో దాడి చేశారు ముష్కరులు. వీరు గాయాలతో బయటపడ్డారు. శ్రీనగర్‌లోని మైసుమా ప్రాంతంలో ఇద్దరు సీఆర్ఫీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. వీరిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:భూతగాదాలో పేలిన తూటాలు.. నలుగురు మృతి