ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి- ఓ జవాను మృతి - Kulgam security forces attack
11:08 January 27
ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి- ఓ జవాను మృతి
జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. భద్రతా దళాలపై గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని 92 బేస్ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
బుధవారం ఉదయం శాంప్సిపొర రహదారి సమీపంలో శానిటైజేషన్ డ్రిల్ నిర్వహిస్తున్న భద్రతా దళాలను చూసి ముష్కరులు దాడికి తెగబడినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఘటన అనంతరం ఆ ప్రాంతాన్ని నిర్బంధించి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.