జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా బలగాలు. జిల్లాలోని క్రెరీ ప్రాంతంలోని వనిగాం పేయిన్లో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు.
దీంతో ఎదురుకాల్పులు జరిపిన భద్రతా బలగాలు.. ఇద్దరు తీవ్రవాదులను హతమార్చాయి. అయితే ముష్కరులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనేది ఇంకా తెలియలేదు.