జమ్ముకశ్మీర్లో భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు. శ్రీనగర్ నౌగమ్లోని వగూరాలో ఈ ఎన్కౌంటర్(Encounter) జరిగినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
మంగళవారం రాత్రి ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.