జమ్ముకశ్మీర్లో శనివారంజరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లా వాంగమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్న సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి.ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు.
కశ్మీర్లో ఎన్కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం - encounter in jammu kashmir
జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలకు, ముష్కరులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఓ సైనికుడు అమరుడయ్యాడు.
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్
ఈ ఘటనలో ఓ సైనికుడు అమరుడయ్యాడు. మరో జవాను గాయపడ్డాడు.గాయపడ్డ సైనికుడిని అధికారులు.. ఆసుపత్రికి తరలించారు.ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:లేడీ సింగమ్ ఆత్మహత్య కేసులో అధికారి అరెస్టు
Last Updated : Mar 28, 2021, 2:17 AM IST