తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఇద్దరు ఉగ్ర అనుచరులు అరెస్ట్​ - జమ్ముకశ్మీర్​లో ఉగ్ర అనుచరులు అరెస్టు

Militant Arrested in Jammu: లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు అనుచరులను భద్రతా బలగాలు.. జమ్ముకశ్మీర్​లోని బుద్గాం జిల్లాలో అరెస్ట్​ చేశాయి. వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

LeT Associates arrested
ఉగ్రవాద అనుచరులు

By

Published : Dec 23, 2021, 10:31 PM IST

Militant Arrested in Jammu: జమ్ముకశ్మీర్​లోని బుద్గాం జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాద అనుచరులను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. జిల్లాలోని మగమ్ ప్రాంతంలో ఉగ్రవాద అనుచరులు ఉన్నారనే పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నిందితులను మహమ్మద్​ షఫీ గనై, జహూర్​ అహ్మద్​ చోపన్​లుగా గుర్తించారు. వారి నుంచి మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

LeT Associates Arrested: ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిందితులు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదుల అనుచరులను తేలింది. ముష్కరులకు ఆవాసం కల్పించడం, నిత్యావసర వస్తువులను అందించటం, రవాణా తదితర పనులను చేస్తుంటారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండి:ఆన్​లైన్​లో 'వ్యాక్సిన్' మోసం.. తండ్రిని పోగొట్టుకున్న డాక్టర్!

ABOUT THE AUTHOR

...view details