తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో భూప్రకంపనలు.. భయంతో వీధుల్లోకి జనం పరుగులు - కర్ణాటక న్యూస్​

Tremors felt in Karnataka: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. భారీ శబ్దాలతో భూమి కంపించడం వల్ల అనేక ప్రాంతాల్లో ఇళ్లు బీటలువారాయి.

Tremors felt in Karnataka
దెబ్బతిన్న ఇళ్లు

By

Published : Jun 25, 2022, 4:27 PM IST

Tremors felt in Karnataka: కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. సుళ్యా తాలుకాలో ఉదయం 9:10 నిమిషాలకు భారీ శబ్దాలతో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. సుమారు 45 సెకన్ల పాటు కంపించినట్లు చెప్పారు. సుళ్యా సహా కల్లుగుండి, సంపాజే, గూండ్కా, అరంతోడు, ఇవర్నాడు, తోడిక్కన ప్రాంతాల్లో ప్రకపంనలు సంభవించాయి.

పగుళ్లు వచ్చిన గోడలు
దెబ్బతిన్న ఇళ్లు

రిక్టర్​ స్కేల్​పై 2.4 తీవ్రత నమోదైనట్లు విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. సుళ్యా ప్రాంతాల్లోని అనేక ఇళ్లు బీటలువారాయి. ఆందోళన చెందిన ప్రజలు.. ఇళ్లు వదిలి వీధుల్లోకి పరుగెత్తారు. ప్రకంపనల ధాటికి ఇళ్లలోని వస్తువులన్నీ నేలపై పడిపోయాయి. ఈ ఘటనపై ప్రజలు తమకు సమాచారం అందించారని దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్​ కేవీ రాజేంద్ర తెలిపారు.

ఇదీ చదవండి:ప్రయాణిస్తుండగానే బైక్​లో చెలరేగిన మంటలు.. రైడర్​ సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details