తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ వదంతులు: సూరత్​ను వీడుతున్న కూలీలు - బీడ్​​ జిల్లా

గుజరాత్​లోని సూరత్​లో మళ్లీ లాక్​డౌన్​ పెడతారనే వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఫలితంగా చాలా మంది వలస కార్మికులు, కూలీలు పెద్దఎత్తున వారి సొంత రాష్ట్రాలకు వెళుతున్నారు. ఈ క్రమంలో లాక్​డౌన్​ పెట్టే ప్రసక్తే లేదని సీఎం విజయ్ ​రూపానీ స్పష్టం చేశారు. లాక్​డౌన్​ పెడతారన్న వదంతుల్ని నమ్మొద్దని ప్రజల్ని కోరారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో మార్చి 26నుంచి లాక్​డౌన్​ విధిస్తున్నట్లు కలెక్టర్​ వెల్లడించారు.

Migrant workers fleeing Surat because of rumour
లాక్​డౌన్​ వదంతులు

By

Published : Mar 25, 2021, 11:16 AM IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్​లోని సూరత్​లో మళ్లీ లాక్​డౌన్​ విధిస్తారనే వదంతులు ఊపందుకున్నాయి. దీంతో సూరత్​లోని వలస కార్మికులు, కూలీలు వారి సొంత రాష్ట్రాలకు తరలిపోతున్నారు. అయితే ఇదంతా ట్రావెల్​ ఏజెంట్లు కావాలని చేస్తున్న ప్రచారమని కొందరు అంటున్నారు. దీనివల్ల బస్సు టికెట్లు బాగా అమ్ముడు పోతాయని భావిస్తున్నారని వెల్లడించారు.

'లాక్​డౌన్​ పెట్టే ప్రసక్తే లేదు'

లాక్​డౌన్​ వదంతులు: సూరత్​ను వీడుతున్న కూలీలు
లాక్​డౌన్​ వదంతులు: సూరత్​ను వీడుతున్న వలస కార్మికులు
లాక్​డౌన్​ వదంతులు: సూరత్​ను వీడుతున్న కూలీలు
లాక్​డౌన్​ వదంతులు: సూరత్​ను వీడుతున్న కూలీలు

లాక్​డౌన్ పెట్టే ప్రసక్తే లేదని గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​రూపానీ స్పష్టం చేశారు. లాక్​డౌన్​ పెడతారని వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

లాక్​డౌన్​ పెట్టట్లేదని దయచేసి ఎవరూ సొంత రాష్ట్రాలకు వెళ్లొద్దని భాజపా కార్పొరేటర్​ సుధా పాండే ప్రజల్లి కోరారు. బస్టాండ్​లు, ఫ్యాక్టరీ ప్రదేశాలకు వెళ్లి ఆమె ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

అయితే లాక్​డౌన్​ పెడతారన్న భయంతో వలస కార్మికులు సొంత ఊర్లకు వెళ్లడం లేదని.. హోలీ పండగ, పెళ్లిళ్లను దృష్టిలో ఉంచుకొని వెళుతున్నారని తెలిపారు. లాక్​డౌన్​ పెడతారన్న వదంతుల్ని ట్రావెల్​ ఏజెంట్లు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.

లాక్​డౌన్​ వదంతుల్ని నమ్మొద్దని కూలీలను కోరుతున్న భాజపా కార్పొరేటర్​

మహారాష్ట్రలోని బీడ్​ జిల్లాలో లాక్​డౌన్​

మహారాష్ట్రలోని బీడ్​​ జిల్లాలో మార్చి 26నుంచి ఏప్రిల్​6 వరకు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు కలెక్టర్​ రవీంద్ర జగ్​తప్​ వెల్లడించారు. జిల్లాలో రోజుకు 200నుంచి 300 కరోనా కేసులు నమోదవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అత్యవసర సేవలు మినహా మిగతా సేవలు బంద్​ అవుతాయని ప్రకటించారు.

ఇదీ చదవండి:18 రాష్ట్రాలకు పాకిన 'కొత్త రకం' కరోనా

ABOUT THE AUTHOR

...view details