Mid air collision Indigo: రెండు ఇండిగో విమానాలు ఆకాశంలోకి ఎగిరిన కొద్ది సమయానికే అతి దగ్గరగా వచ్చాయి. అయితే, రాడార్ వ్యవస్థ హెచ్చరించటం వల్ల త్రుటిలో ప్రమాదం తప్పింది. బెంగళూరు విమానాశ్రయంలో ఈ సంఘటన జనవరి 9న జరిగినట్లు విమానాయన నియంత్రణ సంస్థ డీజీసీఏ బుధవారం తెలిపింది. కానీ, ఈ దీని గురించి లాగ్‌బుక్‌లో ఏమీ నమోదు చేయలేదని, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి నివేదించలేదని పేర్కొంది.
ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని, తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్. మరోవైపు.. ఈ సంఘటనపై ఇండిగో, ఏఏఐ స్పందించేందుకు నిరాకరించాయి.