తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Microsoft Internship 2023 : మైక్రోసాఫ్ట్​లో ఇంటర్న్‌షిప్​.. హైదరాబాద్​లోనూ చేసే అవకాశం.. అర్హతలు ఇవే! - మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్

Microsoft Internship 2023 : ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ప్రముఖ సాఫ్ట్​వేర్​ కంపెనీ మైక్రోసాఫ్ట్.. తమ సంస్థలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా అభ్యర్థులు భారత్​లోనే ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని అందిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

microsoft-internship-2023-microsoft-hiring-software-engineering-intern
మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌షిప్ 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 12:55 PM IST

Updated : Sep 17, 2023, 1:06 PM IST

Microsoft Internship 2023 :ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాఫ్ట్​వేర్​ కంపెనీ మైక్రోసాఫ్ట్​.. ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు ఓ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. తమ సంస్థలో ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో మంచి సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా రాణించేందుకు ఇది దోహదపడుతుంది. ముఖ్యంగా ప్రపంచ స్థాయి టీమ్​లతో మమేకమవ్వడం, పనిలో మెలుకువలు తెలుసుకోవడం లాంటివి.. స్టూడెంట్స్​గా ఉన్న దశలోనే నేర్చుకోవచ్చు. ఇంటర్న్‌షిప్​కు కావలసిన అర్హతలు, మైక్రోసాఫ్ట్​లో ఇంటర్న్‌షిప్​ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌షిప్​కు కావాల్సిన అర్హతలు..
Microsoft Internship Eligibility :

  • ఇంజినీరింగ్​లో బ్యాచి​లర్​ డిగ్రీ లేదంటే మాస్టర్​ డిగ్రీ చదివే విద్యార్థులు మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌షిప్​కు అర్హులు.
  • ఇంజినీరింగ్​లో కంప్యూటర్​ సైన్స్​, దానికి సంబంధించిన కోర్సులే చేస్తుండాలి.
  • ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన తర్వాత కనీసం ఒక అదనపు క్వార్టర్/సెమిస్టర్ పరీక్షలు మీకు మిగిలి ఉండాలి.
  • అదేవిధంగా ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ లాంగ్వేజ్​లో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
  • కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్‌, డేటా స్ట్రక్చర్‌, అల్గారిథమ్‌ తెలిసి ఉండాలి.

మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌షిప్​ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
Microsoft Internship Benefits :సాఫ్ట్​వేర్​ ఇంజినీర్స్​ ఇంటర్న్​షిప్​లో భాగంగా.. బృంద సభ్యులతో కలిసి సమస్యలను పరిష్కరిస్తారు. దాంతోపాటు సాఫ్ట్​వేర్​ సొలూషన్స్​లో వినూత్న ఆలోచనలకు స్వీకారం చుట్టేందుకుఅవకాశం పొందుతారు. సేవల్లో నాణ్యత కోసం, కస్టమర్​ల సంతప్తి కోసం పనిచేయడం ఏలానో నేర్చుకుంటారు. పొగ్రామ్ మేనేజర్ల నుంచి మెలుకువలు సైతం తెలుసుకుంటారు.

ముఖ్యంగా ఈ ఇంటర్న్​షిప్ వలన విద్యార్థి దశలోనే వినియోగదారులకు కావసిన సేవలు, అవసరాలు గురించి మీకొక అవగాహన ఏర్పడుతుంది. దాంతో పాటు కొత్త సాంకేతికతను, వివిధ రకాల టూల్స్​ను, ఇతర పద్ధతులను ఉపయోగించి.. సాఫ్ట్​వేర్​ సొలూషన్స్​ను ఎలా చేయాలనేది నేర్చుకుంటారు. సాఫ్ట్​వేర్​ డిజైన్​, డెవలపింగ్​, న్యూ జనరేషన్​ సాఫ్ట్​వేర్ క్రియేషన్​ మొదలైన వాటిపై.. స్టూడెంట్​గా ఉన్నప్పుడే మంచి అవగాహన పొందుతారు.

ఎక్కడ పనిచేయాలి..
ఎంపికైన విద్యార్థులు.. బెంగళూరు, హైదరాబాద్​, నోయిడా నగరాలలో మైక్రోసాఫ్ట్​ ఇంటర్న్‌షిప్​ చేయవచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
మైక్రోసాఫ్ట్ సంస్థలో ఇంటర్న్‌షిప్​ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే.. Microsoft Careers FAQ పేజీని సందర్శించండి. అనంతరం దరఖాస్తు, ఇంటర్వ్యూ తదితర వివరాలు తెలుసుకోండి.

Last Updated : Sep 17, 2023, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details