పాకిస్థాన్లోని గురుద్వారాలను సందర్శించేందుకు సిద్ధమైన 600మంది సిక్కు యాత్రికులకు కేంద్ర హోంశాఖ అనుమతి నిరాకరించింది. ఈ విషయాన్ని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీకు స్పష్టం చేసింది. కొవిడ్, భద్రతా సమస్యల కారణంగా అనుమతి నిరాకరించినట్టు పేర్కొంది.
కొవిడ్ కారణంగా గతేడాది మార్చి నుంచి ఇరు దేశాల మధ్య రాకపోకలు, వ్యాపారాలు తగ్గాయని కేంద్రం వెల్లడించింది. పాక్లో వైద్యానికి ఉన్న మౌలిక వసతులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని పేర్కొంది. వీటితో పాటు దాయాది దేశంలో పర్యటకులకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తవచ్చని అభిప్రాయపడింది.