రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్ మార్గదర్శకాలు జూన్ చివరి వరకూ కొనసాగించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. జిల్లా అధికార యంత్రాంగాలు వైరస్ కట్టడి చర్యలపై దృష్టి సారించాలని పేర్కొంది.
'కఠిన నిబంధనల కారణంగా వైరస్ సోకే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. కొన్ని ప్రాంతాలు మినహా చాలా చోట్ల మెరుగైన ఫలితం కనిపించింది. అయినప్పటికీ యాక్టివ్ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా కఠిన నిబంధనలు కొనసాగించడం అవసరం' అని హోంశాఖ కార్యదర్శి అజయ భల్లా పేర్కొన్నారు.
స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకునే నిబంధనలు సడలించాలని భల్లా స్పష్టం చేశారు. ఏప్రిల్ 29 నుంచి ప్రారంభమైన నిబంధనలు జూన్ 30 వరకు కొనసాగించాలన్నారు. అయితే, లాక్డౌన్ కొనసాగింపుపై స్పష్టత ఇవ్వలేదు.