తెలంగాణ

telangana

By

Published : Jan 27, 2021, 10:56 PM IST

ETV Bharat / bharat

కొత్త లాక్​డౌన్​ మార్గదర్శకాలు- స్విమ్మింగ్ ​పూల్స్​ ఫుల్​

లాక్‌డౌన్ మార్గదర్శకాలను మరోసారి పొడిగించింది కేంద్రం. గత మార్గదర్శకాలనే కొనసాగిస్తూ.. సినిమా హాళ్లను పూర్తి సామర్థ్యంతో నడుపుకోవచ్చని పేర్కొంది. ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి నెలాఖరు వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.

MHA issues fresh COVID-19 guidelines: Swimming pools for all, more can watch films in halls
ఫిబ్రవరి నెలాఖరు వరకు కొత్త అన్​లాక్​ మార్గదర్శకాలు

దేశంలో లాక్‌డౌన్ మార్గదర్శకాలను మరోసారి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది నవంబర్‌లో విడుదల చేసిన మార్గదర్శకాలే ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇవి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.

హోంశాఖ తాజా మార్గదర్శకాలివే..

  • సినిమా హాళ్లను పూర్తి సామర్థ్యంతో నిర్వహించుకోవచ్చు. దీనిపై సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు విడుదల చేస్తోంది.
  • స్విమ్మింగ్‌ పూళ్లలో అందరికీ అనుమతి ఉంటుంది.
  • అంతర్రాష్ట్ర ప్రయాణాలు, రాష్ట్రం లోపల వేర్వేరు ప్రాంతాలకు చేసే ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఇందుకు ప్రత్యేకంగా ఎలాంటి అనుమతులు అవసరం లేదు
  • కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల అన్ని రకాల కార్యక్రమాలకు అనుమతి.
  • సామాజిక, మతపర, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక ప్రాంతాల్లో ఇప్పటికే 50 శాతం లేదా 200కు మించకుండా ఇచ్చిన అనుమతులు సడలింపు
  • అన్ని రకాల ఎగ్జిబిషన్‌ హాళ్లకు అనుమతి.

అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై పౌర విమానయాన శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి:త్వరలో భారత్ చేతికి మరో మూడు రఫేల్​ జెట్స్​

ABOUT THE AUTHOR

...view details