బంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై కేంద్రం చర్యలకు పూనుకుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో కూడిన నిజనిర్ధరణ బృందాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర హోంశాఖ.
హింస చెలరేగడానికి కారణాలను శోధించే ఈ బృందానికి హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వం వహిస్తారని కేంద్రం తెలిపింది. వీరంతా బంగాల్‌కు బయలుదేరారని వెల్లడించింది.