తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్ హింసపై గవర్నర్​ను నివేదిక కోరిన హోంశాఖ - బంగాల్​ హింస ఘటనపై కేంద్ర హోంశాంఖ

బంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న హింసపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. బంగాల్​ శాంతిభద్రతలపై నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర గవర్నర్​ను నివేదిక కోరింది కేంద్ర హోంశాఖ.

MHA
హోంశాఖ

By

Published : May 6, 2021, 3:17 PM IST

బంగాల్​లో శాంతిభద్రతలపై నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర గవర్నర్ జగ్​దీప్ ధన్​కర్​ను కోరింది కేంద్ర హోంశాఖ. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వివరణ అడిగింది.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించాలని ఇటీవలే హోంశాంఖ కోరినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఓ అధికారి తెలిపారు.

బంగాల్​లో ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై దృష్టిసారించిన కేంద్రం.. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో కూడిననిజనిర్ధరణ బృందాన్ని ఏర్పాటు చేసింది.

బంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆరుగురు మృతి చెందారని భాజపా ఆరోపిస్తోంది. దీన్ని టీఎంసీ తిప్పికొట్టింది.

ఇదీ చదవండి:'అజిత్​ సింగ్​ చేసిన రైతు పోరాటాలు చిరస్మరణీయం'

ABOUT THE AUTHOR

...view details