మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో అమానవీయ ఘటన జరిగింది. మనవడు తప్పు చేశాడనే ఆరోపణతో ఓ వృద్ధురాలిపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఒంటిపై ఉన్న దుస్తులను తీసేసి మరీ కొట్టారు. అంతటితో ఆగకుండా ఈ దుర్ఘటనను ఫోన్లో చిత్రీకరించి వీడియోను వైరల్ చేశారు.
మనవడు చేసిన తప్పుకు బామ్మపై దాడి.. బట్టలు చించేసి.. దారుణంగా కొట్టి! - aurangabad latst news
మనవడు తప్పు చేశాడనే ఆరోపణతో ఓ వృద్ధురాలి పట్ల దారుణంగా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు చించేసి దాడికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఔరంగాబాద్ పట్టణంలోని గంగాపుర్కు చెందిన ఓ వృద్ధురాలు తన మనవడితో కలిసి పార్దీ ప్రాంతంలో ఉంటోంది. ఓజర్ ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు వివేక్ అలియాస్ చావల్య పింపుల్ తన స్నేహితులతో కలిసి వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. తన కుమార్తెను వృద్ధురాలి మనవడు అవహరించాడని ఆరోపించారు.
అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. అంతేగాక ఆమె ఒంటిపై ఉన్న దుస్తులను తీసేసి మరీ దాడి చేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలు చేతులు జోడించి వదిలిపెట్టమని వేడుకున్నా వారు పట్టించుకోలేదు. ఈ మొత్తం ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించిన నిందితులు.. వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి వైరల్ చేశారు. తాజాగా పోలీసుల దృష్టికి ఆ వీడియో వెళ్లింది. దీంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.