తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆన్​లైన్​ బెట్టింగ్​లో నిండా మునిగిన వ్యాపారి.. రూ.58 కోట్లు లాస్​.. ఆ లింక్​పై క్లిక్​ చేయడం వల్లే! - ఆన్​లైన్​ బెట్టింగ్​లో రూ కోట్లు మోసపోయిన వ్యాపారి

Online Gambling Fraud Nagpur : ఓ వ్యాపారవేత్త ఆన్‌లైన్‌ జూదంలో భారీగా మోసపోయాడు. తక్కువ సమయంలో కోట్ల రూపాయలు వస్తున్నాయని ఆశపడి.. చివరికి రూ.58 కోట్లు కోల్పోయాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Online Gambling Fraud Nagpur
Online Gambling Fraud Nagpur

By

Published : Jul 23, 2023, 11:37 AM IST

Updated : Jul 23, 2023, 12:03 PM IST

Online Gambling Fraud Nagpur : ఆన్​లైన్ బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడుల ఆశ చూపి మహారాష్ట్రలో ఓ వ్యాపారవేత్తను నిండా ముంచేశాడు ఓ బుకీ. దాదాపు రూ. 58 కోట్ల మేర మోసం చేశాడు. దీంతో బాధితుడు ఆత్మహత్య యత్నం చేశాడు. అనంతరం ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. నాగ్​పుర్​కు చెందిన ఓ వ్యాపారవేత్తకు గోందియా జిల్లాకు చెందిన అనంత్​ నవరతన్ జైన్​తో పరిచయం ఏర్పడింది. ఆన్​లైన్​ జూదం ద్వారా స్వల్ప వ్యవధిలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని వ్యాపారిని నమ్మించాడు నిందితుడు అనంత్​. అనంతరం బాధితుడికి వాట్సాప్​లో ఆన్​లైన్​ జూదం లింక్​లు పంపించి ఆడించాడు. క్రమంగా ఆన్​లైన్​ జూదానికి అలవాటు పడేలా చేశాడు. అయితే, మొదటి సందేహించిన వ్యాపారి.. ఆ తర్వాత రూ. 8 లక్షలు నిందితుడికి పంపించి.. ఆన్​లైన్ జూదం ఆడటం ప్రారంభించాడు.

మొదటలో రూ. 5 కోట్లు గెలిచాడు. దీంతో అనంత్​ను పూర్తిగా నమ్మాడు వ్యాపారి. ఆ తర్వాత స్నేహితులు, బంధువుల వద్ద నుంచి అప్పు చేసి మరీ జూదం ఆడాడు. కానీ ఆ తర్వాత నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి. నవంబర్​ 2021 నుంచి ఇప్పటివరకు రకరకాల జూదాలు ఆడి.. ఏకంగా దాదాపు రూ. 58.42 కోట్ల వరకు నష్టపోయాడు. అయితే, నిందితుడు ప్రణాళిక ప్రకారం తప్పుడు లింక్​లు పంపించి బాధితుడిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడి ఇంటిపై దాడి చేసిన పోలీసులు

అయితే, ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన బాధితుడు.. తన డబ్బు వాపస్‌ ఇవ్వాలని నవరతన్​ను అడిగాడు. దీనికి నిందితుడు జైన్‌ నిరాకరించాడు. అంతేకాకుండా తనకే తిరిగి రూ. 40 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు. అనరంతం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదుతో నాగ్‌పుర్ పోలీసులు కాకా చౌక్‌లోని బుకీ నివాసంపై దాడి చేశారు. 17 కోట్లకు పైగా నగదు, సుమారు 4 కిలోల బంగారం, 200 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే.. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడు దుబాయ్‌ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Last Updated : Jul 23, 2023, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details