మహారాష్ట్రలో ఓ బంగాళదుంప మొక్కను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. అందుకు గల కారణం తెలిస్తే మీరూ వెళ్లి చూద్దామనుకుంటున్నారు!. పుణె జిల్లాలోని ఇద్దరు యువరైతులు తమకున్న మూడు ఎకరాల పొలంలో బంగాళదుంపలను పంట వేశారు. కోతల సమయంలో తమ పంటను కోసేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో ఓ మొక్కను చూసి అవాక్కయ్యారు.
కొమ్మకు విరగకాసిన బంగాళదుంపలు.. విడ్డూరంగా ఉంది కదూ! - మహారాష్ట్ర బంగాళదుంప మొక్క
ఎక్కడైనా బంగాళదుంపలు మట్టిలో పండుతాయి. కానీ ఆ ప్రాంతంలో కొమ్మకు కాస్తున్నాయి!. దీంతో ఆ మొక్కను చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే?
potato growing above ground
జిల్లాలోని ఆంబెగావా మండలంలోని నిర్గుడ్సర్ గ్రామంలో ప్రజలందరూ ఎక్కువగా బంగాళదుంప పంటను సాగు చేస్తుంటారు. అదే గ్రామానికి చెందిన సందీప్, ధనేశ్ పాండురంగ్ కూడా తమ పొలంలో బంగాళదుంప పంటను వేశారు. ఇటీవలే ఈ పంట చేతికందింది. కానీ అందులోని ఓ మొక్క వేళ్లకు కాయాల్సిన దుంపలు కొమ్మకు విరగ కాశాయి. దీంతో ఆ మొక్కను చూసి షాకయ్యారు.
ఎంతో కాలంగా బంగాళదుంపలను పండిస్తున్నాము కానీ ఇలా కొమ్మకు కాయడం చూసి ఆశ్చర్యంగా అనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. చలికాలం కావడం వల్ల ఆ దుంపలు కాస్త పచ్చగా మారాయని తెలిపారు.