అభిమానుల అత్యుత్సాహం... మహారాష్ట్ర మాలేగావ్‌లోని ఓ థియేటర్లో అగ్ని ప్రమాదానికి దారితీసింది.
లాక్‌డౌన్‌తో మూతపడి, ఇటీవల తిరిగి తెరుచుకున్న థియేటర్లో కరణ్ అర్జున్ సినిమా ప్రదర్శిస్తుండగా ఈ ఘటన జరిగింది. తెరపై షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కనిపించగానే కొందరు అభిమానులు హాల్లోనే టపాసులు పేల్చారు. ఫలితంగా మంటలు చెలరేగాయి. కొన్ని కుర్చీల దగ్ధమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.