ప్రముఖ పారిశ్రామిక వేత్త భవర్లాల్ జైన్ జయంతి సందర్భంగా.. ఆయనకు వినూత్నరీతిలో నివాళులర్పించారు ఓ కళాకారుడు. మహారాష్ట్రకు చెందిన ప్రదీప్ భోస్లే.. 18వేల అడుగుల వైశాల్యంలో(150x120) జైన్ రూపంలో మొజాయిక్ కళాఖండాన్ని రూపొందించారు. జైన్ పైప్స్ వ్యవస్థాపకులైన భవర్లాల్ చిత్రానికి.. అదే కంపెనీకి చెందిన పీఈ, పీవీసీ పైపులనే వినియోగించడం విశేషం. తెలుపు, నలుపు, బూడిద రంగులతో కలబోసి చూపరులను ఆకట్టుకుంటోన్న ఈ మొజాయిక్ చిత్రం.. గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది.
18వేల అడుగుల వైశాల్యంలో భవర్లాల్ చిత్రం - పైప్లైన్ ఆర్టిస్ట్ ప్రదీప్ భోస్లే
మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన ఓ కళాకారుడు.. తమ కంపెనీ వ్యవస్థాపకునికి వినూత్న రీతిలో నివాళులర్పించారు. పారిశ్రామిక వేత్త భవర్లాల్ జైన్ జయంతి సందర్భంగా 18వేల అడుగుల వైశాల్యంలో ఆయన చిత్రాన్ని రూపొందించారు. చూపరులను ఎంతగానో ఆకర్షించే ఈ చిత్రానికి గిన్నిస్ బుక్లో చోటు దక్కింది.
పైపులనే కుంచె చేసి.. అద్భుతమైన కళాఖండం నిర్మించి..
జైన్ ఇరిగేషన్ సహోద్యోగి అయిన భోస్లే.. ఈ అద్భుత కళాఖండాన్ని చిత్రించేందుకు 25 మెట్రిక్ టన్నుల(8వేల) పీవీసీ పైపులను ఉపయోగించారట. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 14 గంటల శ్రమించినట్టు సమాచారం. అంటే మొత్తంగా 98 గంటల సమయాన్ని వెచ్చించారన్నమాట. ఈ కళాఖండానికి వాడిన మొత్తం పైపులను తీసి విడిగా అమర్చితే దాని పొడవే 21.9 కిలోమీటర్లు ఉంటుందట.
ఇదీ చదవండి:'ఖేలో ఇండియా'కు ముందు స్కైయర్ల విన్యాసాలు