తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తాజ్ హోటల్​ పదో అంతస్తు నుంచి దూకి దుబాయ్ వ్యాపారవేత్త ఆత్మహత్య

ముంబయిలో ఓ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రఖ్యాత తాజ్​ హోటల్​ పదో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన మరో ఘటనలో 21 ఏళ్ల వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

businessman commits suicide
businessman commits suicide

By

Published : Dec 4, 2022, 11:48 AM IST

పదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యాపారవేత్త. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని ప్రఖ్యాత తాజ్​ హోటల్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతుడిని షారుఖ్​ ఇంజినీర్​గా గుర్తించారు.

షారుఖ్​.. ప్రస్తుతం దుబాయ్​లో నివసిస్తున్నాడు. భారత్​లో ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు శనివారం ముంబయి వచ్చాడు. తాజ్​ హోటల్​లో తల్లిదండ్రులను కలిసిన షారుఖ్​.. కాసేపటికే పదో అంతస్తు నుంచి దూకాడు. ఐదో అంతస్తులో రక్తపు మడుగులో ఉన్న షారుఖ్​ను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా మృతుడి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

వైద్యవిద్యార్థి ఆత్మహత్య
21 ఏళ్ల వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ఫిరోజాబాద్​లో జరిగింది. కౌశల్య నగర్​కు చెందిన శైలేంద్ర శంఖావర్​ ప్రభుత్వ మెడికల్​ కళాశాలలో వైద్యవిద్య చదువుతున్నాడు. శనివారం ఎగ్జామ్ ఉండగా.. సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేదు. దీంతో సిబ్బంది అతడిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు.

దీంతో కలత చెందిన శైలేంద్ర హాస్టల్​ గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్రమత్తమైన సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించాడు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు.

ఇవీ చదవండి:సాయిబాబా పాదాలు మొక్కుతూ గుండెపోటుతో భక్తుడు మృతి

రైలు పట్టాలపై ఇన్​స్టా రీల్స్.. చెవుల్లో ఇయర్​ఫోన్స్.. ట్రైన్ వచ్చి నేరుగా..

ABOUT THE AUTHOR

...view details