కరోనాతో ఇప్పటికే పలువురు నేతలు మృతి చెందగా.. తాజాగా బిహార్‌లోని జేడీయూ ఎమ్మెల్యే మేవలాల్ చౌదరి మరణించారు. పట్నాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
గతవారం మేవలాల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సూచనల మేరకు పారస్ ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించి.. సోమవారం ఉదయం 4 గంటలకు మరణించిట్లు అధికారులు వెల్లడించారు.