తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మెటావర్స్‌'లో వివాహ రిసెప్షన్‌.. దేశంలోనే తొలిసారి - మెటావర్స్ పెళ్లి రిసెప్షన్

Metaverse reception Tamil Nadu: దేశంలోనే తొలిసారి మెటావర్స్​ పద్ధతిలో వివాహ రిసెప్షన్ జరగనుంది. తమిళనాడుకు చెందిన టెక్ నిపుణుడు దినేష్ క్షత్రియన్.. తమ బంధువులు, మిత్రులు వర్చువల్‌ పద్ధతిలో హాజరయ్యేలా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

metaverse reception
metaverse reception

By

Published : Jan 18, 2022, 6:42 AM IST

Metaverse reception Tamil Nadu: తమిళనాడులోని ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్టు అసోసియేట్‌గా పనిచేస్తున్న సాంకేతిక నిపుణుడు దినేష్‌ క్షత్రియన్‌కు జనగనందిని అనే యువతితో ఫిబ్రవరిలో ఓ గ్రామంలో వివాహం జరగనుంది. రిసెప్షన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ బంధువులు, మిత్రులు 'మెటావర్స్‌' అనే వర్చువల్‌ పద్ధతిలో హాజరయ్యేలా నిర్వహించాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ జంట ఈ మధ్యే తమ 'అవతార్‌'ల ద్వారా కలుసుకున్న రిహార్సల్‌ వీడియోను దినేష్‌ సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఇది ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

Metaverse Wedding reception India

'మెటావర్స్‌'లో వివాహ రిసెప్షన్‌

తాను బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలో పనిచేస్తున్నానని, మెటావర్స్‌కు అదే మూలం కావడంతో ఆ పద్ధతిలోనే రిసెప్షన్‌ పెట్టాలనుకున్నప్పుడు తనకు కాబోయే భార్య కూడా అందుకు అంగీకరించిందన్నారు. మెటావర్స్‌ పద్ధతిలో యూజర్లంతా వర్చువల్‌గా కలుసుకుని, డిజిటల్‌ అవతార్‌లతో ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చు. మెటావర్స్‌లో ఆగ్మెంటెడ్‌ రియాల్టీ, బ్లాక్‌చైన్‌, వర్చువల్‌ రియాల్టీ కలగలిసి ఉంటాయి. ఈ రంగంలోని ఒక అంకుర సంస్థతో కలిసి దేశంలోనే తొలిసారిగా మెటావర్స్‌ పెళ్లి చేసుకుంటున్నట్లు ట్విట్టర్‌ ద్వారా దినేష్‌ ప్రకటించారు.

ఇదీ చదవండి:నిశ్చితార్థం తర్వాత మరొకరితో చాటింగ్​- కుమారుడ్ని చంపిన తల్లిదండ్రులు

ABOUT THE AUTHOR

...view details