తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ తొలగించండి' - సద్గురు జగ్గీవాసుదేవ్

దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణను తొలగిస్తామని తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఈశా ఫౌండేషన్​ స్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్​..తమిళనాడు సీఎం పళని స్వామికి, ప్రతిపక్షనేత స్టాలిన్​కు లేఖ రాశారు. ప్రభుత్వ నియంత్రణలో దేవాలయాలు ఉండడం వల్ల వాటి పవిత్రత, ప్రతిష్ఠ దెబ్బతింటోందని అన్నారు.

'Mention in poll manifesto freeing of temples from govt grip'
'దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించండి'

By

Published : Mar 6, 2021, 8:47 PM IST

దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండొద్దన్న ప్రచారం హోరెత్తుతున్న వేళ, ఈశా ఫౌండేషన్​ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసు దేవ్​.. తమిళనాడు సీఎం పళని స్వామికి, ప్రతిపక్షనేత స్టాలిన్​కు లేఖ రాశారు. ఎన్నికల మేనిఫెస్టోలో దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ తొలగిస్తామని పేర్కొనాలని కోరారు. ఈ లేఖను జగ్గీవాసుదేవ్​ తరపున ఆయన అనుచరులు స్టాలిన్​కు, పళని స్వామికి అందించారు.

"ప్రజల అభీష్టాల్ని తీర్చండి. దేవాలయాల నుంచి ప్రభుత్వ నియంత్రణను తొలగించాలని వారు ఉద్యమిస్తున్నారు. వారి కోర్కెలకు అనుగుణంగా దేవాలయాలపై నియంత్రణ తొలగిస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనండి."

-జగ్గీవాసు దేవ్​, ఈశా ఫౌండేషన్​ వ్యవస్థాపకులు

దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వల్ల వాటి పవిత్రత దెబ్బతింటోందని అన్నారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన హిందూ రిలీజియన్​ అండ్​ ఛారిటబుల్​ ఎండోన్​మెంట్​ యాక్ట్​-1959 అత్యధిక సంఖ్యాక వర్గమైన హిందూవుల దేవాలయాల పవిత్రతను, ప్రాధాన్యాన్ని నాశనం చేసిందని పేర్కొన్నారు. రాజ్యాంగం ఇచ్చిన మతపరమైన స్వేచ్ఛకు ఇది విఘాతం కలిగిస్తోందని అన్నారు. రాజ్యంగంలోని లౌకికభావనకు ఈ చట్టం తూట్లు పొడుస్తుందని తెలిపారు.

ఇదీ చూడండి:వర్చువల్​గానే 'ఈశా' ఫౌండేషన్​ శివరాత్రి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details