Mentally Ill Person Missing :సినిమాల్లోని హీరోల్లా ప్రవర్తిస్తూ అందరిపై దాడి చేసే ఓ మానసిక రోగి.. మూడు నెలల క్రితం తప్పిపోయి తాజాగా కర్ణాటకలో ప్రత్యక్షమయ్యాడు. తనను తాను హీరోగా భావిస్తూ యాక్షన్ సీన్ల పేరుతో దాడి చేసి అందరినీ ఇబ్బంది పెట్టేవాడు. చికిత్స కోసం భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. అక్కడి నుంచి పరారయ్యాడు. చివరకు మూడు నెలల తర్వాత అతడి ఆచూకీ లభ్యమైంది.
అసలేమైందంటే?
మహారాష్ట్ర.. బీడ్ జిల్లాలోని దస్కాడేకు చెందిన ముసలే భగవాన్ కుమారుడు తుకారామ్కు సినిమాలంటే చాలా ఇష్టం. అతడు చిన్నప్పటి నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. సినిమాలు చూసిన ప్రతీసారి అతడి వ్యాధి తీవ్రత మరింత ఎక్కువయ్యేది. అంతే కాకుండా మూవీలు చూశాక అందులోని హీరోలాగే ప్రవర్తించాలనుకుని అనేక మందిని ఇబ్బందిపెట్టేవాడు.
అయితే తుకారాం మానసిక వ్యాధి నయం చేయించాలన్న ఉద్దేశంతో అతడి కుటుంబసభ్యులు.. మూడునెలల క్రితం భూతవైద్యుడిని సంప్రదించారు. ఆ సమయంలో భూతవైద్యుడు.. తుకారాంను తన వద్ద 15రోజులు ఉంచాలని కోరాడు. అప్పుడే వైద్యం చేస్తానని తెలిపాడు. అందుకు తుకారం కుటుంబసభ్యులు అంగీకరించారు. అయితే భూతవైద్యుడు చికిత్స ప్రారంభించిన ఒక్కరోజుకే తుకారాం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.