Sub Engineer Suicide: అనారోగ్యంతో తీవ్ర మానసిక క్షోభ అనుభవించిన ఓ సబ్ ఇంజినీర్ ప్రాణం తీసుకున్నాడు. తలకు పాలిథీన్ బ్యాగ్ చుట్టుకొని.. అందులో నింపిన నైట్రోజన్ గ్యాస్‌ను పీల్చుకొని ఊపిరాడక చనిపోయాడు. చనిపోయే ముందు సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ నర్మదాపురంలో జరిగింది. మృతుడిని మునిసిపాలిటీలో పనిచేసే సబ్ ఇంజినీర్ చేతన్ భూమర్కర్గా గుర్తించారు.
మీనాక్షి చౌక్‌లోని గిన్నీ కాంపౌండ్‌లో పనిచేసే చేతన్ భూమర్కర్కు కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగాలేదు. దీంతో తీవ్రంగా కుంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం చేతన్ ఎంతసేపటికీ తన గది తలుపులు తెరవకపోయేసరికి.. ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. వారు తలుపులు పగులకొట్టి చూడగా చేతన్ విగతజీవిగా పడి ఉన్నాడు.