తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సునామీలో కొట్టుకుపోయాడనుకున్నారు.. కానీ 25 ఏళ్ల తర్వాత ఇంటికి.. - తమిళనాడు లేటెస్ట్​ న్యూస్​

25 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి వ్యాపారంలో నష్టం కారణంగా తీవ్ర మనస్థాపానికి గురై ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. మతిస్థిమితం కోల్పోయి వీధుల వెంట తిరుగుతూ జీవనం సాగించాడు. ఇటీవలే అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వల్ల రోడ్డు పక్కన పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడ్ని గుర్తించి తన ఇంటికి చేర్చారు.

Mentally Disabled person
Mentally Disabled person

By

Published : Dec 1, 2022, 10:31 PM IST

Updated : Dec 1, 2022, 10:40 PM IST

ఆ వ్యక్తిని సునామీలో కొట్టుకుపోయి చనిపోయాడని అతడి కుటుంబం భావించింది. ఆ కారణంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. చనిపోయాడనుకున్న వ్యక్తి పాతికేళ్ల తర్వాత బతికే ఉన్నాడని తెలుసుకున్న ఆ కుటుంబం ప్రస్తుతం ఆనందంలో మునిగితేలుతోంది.

25 క్రితం డేవిడ్ దురైరాజ్​ వ్యాపార నష్టం, కుటుంబ సమస్యల కారణంగా మనస్థాపానికి గురయ్యాడు. దీంతో 1997లో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అప్పట్లో అతని కుటుంబసభ్యులు ఎంత వెతికినా డేవిడ్​ ఆచూకీ లభించలేదు. దీంతో డేవిడ్​ కుటుంబసభ్యులు 2004లో వచ్చిన సునామీలో చనిపోయాడు అనుకుని.. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే ఆ తర్వాత చెన్నై చేరుకున్న డేవిడ్..​ నగర వీధుల్లో తిరుగుతూ ప్లాస్టిక్, ఇనుము సేకరిస్తూ జీవనం సాగించేవాడు. అయితే కొద్ది రోజుల నుంచి మతిస్థిమితం లేని వ్యక్తి చెన్నైలోని అంబరం శానిటోరియం ప్రాంతంలో రోడ్డు పక్కన జీవనం సాగిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి వెళ్లిన పోలీసులు ఆ వ్యక్తిని విచారించారు. అతడు చెప్పిన దాని బట్టి కోవిల్‌పట్టి వేలాయుతపురం ప్రాంతానికి చెందిన డేవిడ్ దురైరాజ్​గా గుర్తించారు.

అనంతరం డేవిడ్ ఫొటోను కోవిల్​పట్టి పోలీసు స్టేషన్​కు పంపించారు. దీంతో అక్కడి పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న దురైరాజ్ కుటుంబీకులు ఎంతో ఆనందంతో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం అతనికి ఓ కుమారుడు, ఓ కుమారై ఉన్నారు. వరదల్లో చనిపోయినట్లు భావించిన వ్యక్తిని.. తిరిగి తమకు అప్పగించినందుకు.. కుటుంబ సభ్యులు పోలీసులకు కన్నీటితో కృతజ్ఞతలు తెలియజేశారు.

Last Updated : Dec 1, 2022, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details