ఎన్ఐఏ, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు పీపుల్స్ డెమోక్రెటిక్ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీ. ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారిపై దేశ ద్రోహం, మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. అసమ్మతిని తెలియజేయడాన్ని దేశంలో నేరంగా పరిగణిస్తున్నారని విమర్శించారు.
శ్రీనగర్‌లోని ఈడీ కార్యాలయానికి గురువారం విచారణకు హాజరైన మెహబూబా ఈ వ్యాఖ్యలు చేశారు.
"బిజ్బెహ్రాలో నా పేరున, నా తండ్రి పేరున ఉన్న స్థలం విక్రయం, ముఖ్యమంత్రి నిధుల దుర్వినియోగంపై ప్రశ్నలు వేశారు. అసమ్మతిని దేశంలో నేరంగా పరిగణిస్తున్నారు. ఈ దేశం రాజ్యాంగం ద్వారా కాకుండా కేవలం ఓ పార్టీ సిద్ధాంతాల ప్రకారం నడుస్తోంది."