పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలిగా మెహబూబా ముఫ్తీ మరోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి సుహైల్బుఖారీ వెల్లడించారు. పార్టీ సీనియర్ నాయకులు, జీఎన్ఎల్ హన్జూరా, ఖురిషీద్ అలాం ఆమె పేరును అధ్యక్ష పదవికి ప్రతిపాదించగా... సీనియర్ సభ్యులు అబ్దుల్ రహ్మాన్ అధ్యక్షత ఉన్న ఎన్నికల బోర్డు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొంది.
ముఫ్తీ అధినేత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. 2016 లో మెహబూబా ముఫ్తీ తండ్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ చనిపోయిన తరువాత పార్టీ సారథిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు ఆమె. తాజా ఎన్నికతో ఆమె మరో మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.