భద్రత కారణాల పేరుతో తనను మరోమారు అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ. పక్షం రోజుల్లోనే మూడోసారి తనను నిర్బంధించారని.. ప్రస్తుతం జరుగుతోన్న డీడీసీ ఎన్నికల ప్రచారానికి భాజపా మంత్రులను అనుమతించి తనపై ఆంక్షలు విధించటమేంటని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
" 15 రోజుల్లోనే మూడోసారి ఇవాళ అక్రమంగా నిర్బంధించారు. ఇది చాలా ఘోరమైన ప్రజాస్వామ్య పరిస్థితి. భద్రతాపరమైన ఆందోళనలతో నా ప్రయాణాలను అడ్డుకున్నప్పుడు.. కశ్మీర్లో భాజపా మంత్రులు స్వేచ్ఛగా ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఎలా ఇచ్చారు? "