నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైతుల నిరసనకు తన మద్దతును తెలిపారు.
ఒక శునకం చనిపోతేనే ఎంతో మంది సంతాపం వ్యక్తం చేస్తారన్న మాలిక్.. రైతు ఉద్యమంలో 250 మంది అన్నదాతలు చనిపోయినా ఎవరూ మాట్లాడలేదన్నారు. ఉద్యమం దీర్ఘకాలం పాటు ఇలాగే కొనసాగితే.. రాజస్థాన్, హరియాణా రాష్ట్రాలతో పాటు పశ్చిమ యూపీలోని పలు ప్రాంతాల్లో భాజపాకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని సత్యపాల్ మాలిక్ హెచ్చరించారు.
రైతుల ఆందోళనపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో ఇప్పటికే చర్చించినట్లు మాలిక్ తెలిపారు. అన్నదాతలను ఖాళీ చేతులతో వెనక్కి పంపకూడదని అభిప్రాయపడ్డారు.